డాక్టర్ సూరంపూడి సుధ (M.A., Ph.D.) గారు ఒక విలక్షణమైన విశిష్ట వ్యక్తి. రచయిత్రిగా, భక్తురాలిగా, ఆధ్యాత్మిక వేత్తగా విశేష మన్ననలను అందుకోవడం జరిగింది. ఆమె వివేక వర్ధిని సాయం కళాశాల ప్రిన్సిపాల్ గా తెలుగు ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారు. ఆమె పుస్తకం గా వెలువరచిన Ph.D.గ్రంథం “భాగవతం లో కృష్ణ తత్త్వం” చాలా ఉన్నత స్థాయిలో రచించబడి ప్రఖ్యాతి వహించింది. M.Phil. “జరుక్ శాస్త్రి పేరడీలు- ఒక పరిశీలన” కూడా పుస్తక రూపం లో ప్రసిద్ధి పొందినది. ఎన్నో ఆధ్యాత్మిక వ్యాసాలు , పుస్తక సమీక్షలూ వివిధ వార,మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదించడం కూడా జరిగింది
అలాగే సమాజం లో మన స్త్రీలు పడే అగచాట్లపై వ్రాసిన కథలు “స్త్రీ సూక్తం” పేరుతోనూ; Dr. కృష్ణ కుమారి గారి డా సుధ కలిసి ప్రచురించిన “కృష్ణ సుధ” వ్యాస సంపుటి చాలా ప్రసిద్ధి పొందాయి. కృష్ణ సుధ లో డా. సుధ వారి అనుభూతులను కృష్ణ ప్రేమ లో పొందిన భావుకతను ఎంతో హృద్యం గా మలచబడింది.
ఆమె లోని భక్తి సంస్కారం, సద్గురు మాతాజీ కృష్ణ ప్రియ గారి శిష్యరికం లోనూ , శ్రీ బేణీప్రసాద్ శర్మ అనే భక్త కవివరేణ్యుని అనుగమించడం లోనూ వికసించి, ఇప్పుడు అవసరమైనవారికి ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. WhatsApp ద్వారా చాలామందికి ఆధ్యాత్మిక గ్రంథాల విషయాలను వివరించి చెప్తున్నారు. Dr. సుధ గారికి భక్తి TV వారు, కోటి దీపోత్సవం సందర్భం లో 2016 లో ఆధ్యాత్మిక గ్రంథ రచయిత్రిగా గుర్తించి సన్మానం చేశారు.
1957 లో శ్రీ సూరంపూడి రామమోహన రావు, శ్రీమతి సుబ్బలక్ష్మి గారి పుత్రిక గా జన్మించిన సుధ గారు వారి తలిదండ్రులతో బాటు, బామ్మా,తాత గారూ , బాబాయిల ప్రభావం తన విద్యా వ్యాసంగాల పై ఉందని నమ్రత తో చెపుతూ ఉంటారు .
Dr. Surampudi Sudha M.A.Ph.D. is a retired Principal and Professor of Telugu literature, Vivek Vardhani Evening College, Hyderabad. She is well known in Social media (WhatsApp) as a devotee of Krishna and who inculcated Krishna Bhakti in many followers. Her Ph.D. thesis viz., “ Krishna Tattvam in Bhagavatam” –publised as a book-- is a good treatise on Lord Krishna’s Philosophy. She also published her M.Phil. Thesis book called " Jaruk Shashtry - an Observation" ( Telugu title Jaruk shastry - oka pariseelana). Another book viz., “Krishna Sudha” co-authored with Dr. Krishna Kumari expresses feelings of Gopikas beautifully, as though she herself lived as a Gopika loving Lord Krishna intensely. Dr. Sudha also touched social evils and problems of Indian women in her book “Stree Suktam”, a book of stories. She also translated some Hindi books to Telugu and published reviews of some books.
Dr. Sudha born 1957, to Sri Surampudi Rammohan Rao & Smt. Subba Lakshmi, acknowledges the influence of her grand parents, parents and uncles (being brought up in a joint family) on her education and skills of writing and music. The best part of her life-experience is as a disciple of Sadguru Mataji Krishnapriya and as a staunch follower of Krishna Bhakta Sri Beni Prasad Shrma ji of Raipur. She is instrumental in publishing Sharmaji’s poetry in Hindi –by name “Krishna Madhuri”.
In all, Sudha says, simple love of Krishna is the basic principle of Devotion to the Lord. That love is expressed by simple songs, dialogues, and stories glorifying Krishna.
After retirement, she has been preaching essence of spiritual knowledge from various spiritual books like Valmiki Ramayanam, Bhagavatam, BhagavadGeeta etc. to thousands of people through social media like WhatsApp/Youtube etc.
In this website an attempt is made to pool/publish all her preachings so that many more people can access and listen all the information and get benefitted.